క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదం: ట్రంప్
వరల్డ్ బాస్కెట్బాల్ స్టార్, ఎన్బీఏ లెజండ్ కోబ్ బ్రయింట్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ద్రిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ శివారులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయింట్, ఆయన 13 ఏళ్ల కూతురు గియాన సహా 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. యుఎస్ ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రయింట్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్న ట్రంప్ ఈ దర్ఘుటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని అన్నారు.













