వైరస్ కట్టడిలో మేం విఫలం కాలేదు : ట్రంప్
కరోనా గురించి ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చిన చైనాపై చర్యలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం సందర్భంగా చైనాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఓ రిపోర్టర్ అధ్యక్షుడ్ని పదేపదే అడిగారు. స్పందించిన ట్రంప్ చైనాపై చర్యలు తీసుకోలేదన్నది నీకు తెలుసా? నేను ఏమీ చెప్పను. చైనాతో పాటు నువ్వు కూడా వాటిని గుర్తిస్తావు అని బదులిచ్చారు. మరోవైపు వైరస్ నియంత్రణలో విఫలమయ్యారన్న మీడియా కథనాలపై ట్రంప్ మండిపడ్డారు. అవన్నీ అవాస్తవాలంటూ, వైరస్ కట్టడిక తాము స్పందించిన తీరుపై వచ్చిన ప్రశంసలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. కాగా. ఇది ట్రంప్ సొంత ప్రచారం మాదిరిగా ఉన్నదంటూ పలు మీడియా సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) సహకారం గురించి తమకు అర్థకావడం లేదంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మండిపడ్డారు. వైరస్ వ్యాప్తికి మూలమైన వుహాన్ లోని మార్కెట్లను తెరువడంపై ఎందుకు మద్దతిస్తున్నదని ప్రశ్నించారు.













