అది ప్రధాని మోదీ చేతుల్లోనే : ట్రంప్
కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ కోరుకుంటే తప్పకుండా మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కశ్మీర్ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. కశ్మీర్ సమస్య పరిష్కరించుకునే బాధ్యత భారత్, పాక్లదేనని, అయితే పరిష్కారం కోసం ఇరుదేశాలు తన సహాయాన్ని కోరితే తోడ్పడేందుకు సిద్ధమేనన్నారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించడం లేదంటూ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అది ప్రధాని మోదీ చేతుల్లోనే ఉందన్నారు. మోదీ, ఇమ్రాన్ ఖాన్ అద్భుతమైన వ్యక్తులని వ్యాఖ్యానించారు.













