కేసులొద్దు… డిపోర్ట్ చేయండి
అక్రమ వలసదారుల్ని వెంటనే వాళ్ల దేశాలకు పంపించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వాళ్లు చొరబాటుదారులని, అక్రమ శరణార్థులను వెంటనే వాళ్ల దేశానికి పంపించాలని, వాళ్లను కోర్టుకు తీసుకువెళ్లడం కానీ, కేసులు పెట్టడం కానీ చేయకూడదంటూ ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ బిల్లుపై త్వరలో అమెరికా చట్టసభ్యులు ఓటింగ్ నిర్వహించనున్నాయి. ఇటీవల ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారుల్ని పట్టుకుని కుటుంబసభ్యుల్ని విడదీస్తున్న విషయం తెలిసిందే. మెక్సికో బోర్డర్ దగ్గర ప్రత్యేక డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు కూడా చేసింది. అక్రమ వలసదారుల్లో భారత్కు చెందిన వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం.













