అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో భారత అమెరికన్ కు డెమోక్రాట్ల మద్దతు
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రత్యేక ఎన్నికల్లో భారత అమెరికన్ అభ్యర్థి హిరాల్ తిపిర్నేనికి డెమోక్రటిక్ పార్టీ మద్దతు పలికింది. ఆమె విజయం ఖాయమన్న నిర్థారణకు వచ్చిన పార్టీ, ఈ మేరకు ఆమెకు బాసటగా నిలిచింది. అరిజోనాలోని 8వ కాంగ్రెస్ జిల్లాకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 24న పోలింగ్ జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రెంట్ ఫ్రాంక్స్, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. అంతకుముందు ఈ స్థానానికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన గేబ్రియెల్లా గిఫోర్డ్ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆమె 2012లో రాజీనామా చేవారు. ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఎన్నడూ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హిరాల్కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రాట్ పార్టీ పేర్కొంది.













