ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యం – దర్శి పవన్ కుమార్
ఆర్యవైశ్యులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రొత్సహించడం, ఈ కులంలో ఉన్న పేదకుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించడం, విద్యా, ఉపాధి చూపించడం నాన్‌రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాసవి అసోసియేషన్ (ఎన్ఆర్ఐవిఏ) ప్రధాన లక్ష్యమని 2018-19 చైర్మన్ దర్శి పవన్‌కుమార్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో వెనుకబడే పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గంలో అవగాహన కల్పించడంతోపాటు అన్ని విధాలుగా చేయతనివ్వాలనే తలంపుతో అసోసియేషన్ 2007 లో స్థాపించినట్లు తెలిపారు. తానా, ఆటా వంటి అసోసియేషన్లలాగే ఇది కూడాఒక సామాజిక అసోయేషన్ మాత్రమేనన్నారు. అయితే కేవలం ఆర్యవైశ్యుల కోసం ఏర్పాటు చేసిన అసోసియేషన్ అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఈ అసోసియేషన్ పాటుపడుతుందన్నారు. ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలోనూ వారి విజయాలకు తాము పాటుపడుతున్నామన్నారు.
సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో అసోసియేషన్ 4వ గ్లోబల్ కన్వెన్షన్‌ను అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి 5 వేల మంది ప్రతినిధులు హాజరుకాన్నుట్లు తెలిపారు. భారత్ నుంచి 100 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకాన్నుట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 2, 3, 4వ తేదీల్ల అసోసియేషన్ నాల్గొవ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహణలో భాగంగా కనెక్టింగ్ టూ సర్వ్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. దీని కోసం 35 కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అటవీశాఖ, మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సినీరంగ ప్రముఖులు అంబికా కృష్ణ తదితరులు హాజరుకాన్నుట్లు తెలిపారు.













