కరోనాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటలీ, దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్-19 ప్రీ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. తమకు కోవిడ్ సోకలేదని నిర్ధారించే ధ్రువపత్రాలు ఉన్న వారినే దేశంలోకి అనుమతిస్తామని సృష్టం చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వీసా పరిమితులతో పాటు ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి దేశానికి రావాలనుకునే ప్రయాణికులకు కోవిడ్-19 ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. అది ఆయా దేశాల్లోని గుర్తింపు పొందిన ప్రయోగశాలల నుంచి పొందినదై ఉండాలని వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ సృష్టం చేసింది. ఈ నెల 10 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది.













