న్యూయార్క్ లో 60 వేల కేసులు
అమెరికాలో వైరస్‌కు కేంద్రస్థానంగా మారిన న్యూయార్క్ లో ప్రతి గంటలకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి ఈ ఒక్క రాష్ట్రంలోనే కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది. సుమారు వెయ్యి మంది మరణించారు. అమెరికా ఆర్థిక మూలాలకు న్యూయార్క్ కేంద్రబిందువు కావడంతో అక్కడ లాక్‌డౌన్‌ను నిర్బంధం చేయడానికి ట్రంప్ సర్కార్ వెనుకాడుతోంది. మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. నిత్యావసరాల కోసం దుకాణాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. న్యూయార్క్ పక్కనే ఉన్న న్యూ జెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాలకు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. అనేక భారతీయ అమెరికన్ గ్రూపులు సంయుక్తంగా కొవిడ్-19 బాధితులకు సాయపడుతున్నాయి.













