అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు!
అమెరికాలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ల లేకుండా పోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన అమెరికా.. లక్ష మార్క్ దాటిన తొలి దేశంగా నేడు రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కేసులు నమోదైన దాఖలాలు లేవు. అలాగే ఇప్పటి వరకు 1500 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాలకపక్షం అన్ని చర్యలు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.













