చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందం!
అమెరికా, చైనా మధ్య కుదరనున్న తొలిదశ వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫ్లోరిడాలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించామని, త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల ఆరంభంలో ప్రకటించిన ఈ తొలి దశ వాణిజ్య ఒప్పందంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరుకు తెరపడే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం చైనా ఉత్పత్తుల్లో కొన్నింటిపై టారిఫ్లు తగ్గించేందుకు అమెరికా అంగీకరించగా, అమెరికా నుండి వ్వవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు చైనా సుముఖత వ్యక్తం చేసింది.













