చైనా విద్యార్థులపై అమెరికా వేధింపులు
అమెరికాలో ఉన్న తమ విద్యార్థులు, పరిశోధకులపై అమెరికా ఉద్దేశపూర్వకంగా వేధింపులకు, అరెస్టులకు పాల్పడుతుందని చైనా విమర్శించింది. చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనే తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసిన కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకురాలు జువాన్ తంగ్కు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి తంగ్ పరారీ కావాలనే ఉద్దేశ్యం చైనాకు లేదని అన్నారు. ఈ కేసును నిష్పాక్షకంగా విచారించాలని, తంగ్ చట్టబద్ధ హక్కులను కాపాడాలని అమెరికాకు ఈ సందర్భంగా చైనా వాజ్ఞప్తి చేసింది. ఏదేమైనా, కొంత కాలంగా చైనా విద్యార్థులను, పరిశోధకులను వేధించడం, ఉద్దేశ్యపూర్వకంగా అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని వెన్బిన్ విమర్శించారు.













