హెచ్-1బీ వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త
అమెరికా హెచ్ 1బీ వీసా ఉన్న వారికి కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసాలున్న 10 వేల మంది తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నూతన టెక్నాలజీ ఆవిష్కరణల్లో అగ్రగామి కావాలని కెనడా ఆశిస్తోంది. అందుకే అమెరికాలో లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించి అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఇది భారతీయ టెకీలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. జులై 16 నాటికి 10 వేల మందికి ఓపెన్ వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయించాం. అమెరికాలో హెచ్ 1బీ వీసా ఉన్నవారు కెనడా వచ్చి పని చేసుకోవచ్చు అని వలసలు, శరణార్థులు, పౌరసత్వశాఖల మంత్రి సీన్ ఫ్రేజర్ తెలిపారు. మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం అనుమతి పొందినవారు మూడేళ్లపాటు కెనడాలో ఎక్కడైనా, ఏ కంపెనీలోనైనా పని చేయవచ్చు. వర్క్ పర్మిట్ పొందినవారి కుటుంబ సభ్యులు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు.













