కెనడా ప్రభుత్వం కొత్త స్కీమ్.. తొలి రోజే టార్గెట్ రీచ్
అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారుల కోసం కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీమ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రోజునే దరఖాస్తులు ప్రభుత్వం విధించిన పరిమితి చేరుకున్నాయి. దీంతో ఈ స్కీమ్ ముగిసిందని, కొత్త దరఖాస్తులను తీసుకోవడం లేదని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల సంస్థ (ఐఆర్సీసీ) తాజాగా ప్రకటించింది. అమెరికాలోని కంపెనీల హై టెక్ విభాగాల్లో ఎన్నో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో హెచ్-1బీ వీసాతో అక్కడ పనిచేస్తున్న వారు మూడేళ్లపాటు తమ దేశంలో పని చేసుకునేందుకు జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని కెనడా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త స్కీమ్ ఏడాది పాటు లేదా 10 వేల దరఖాస్తులను స్వీకరించే వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే జులై 16న స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురాగా జులై 17వ తేదీ నాటికే 10 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఐఆర్సీసీ వెల్లడిరచింది. హెచ్ `1బీ వీసాదారుల కోసం తాత్కాలికంగా తీసుకొచ్చిన పబ్లిక్ పాలసీ ముగిసింది. ఇది గరిష్ఠ పరిమితిని చేరుకోవడంతో కొత్త దరఖాస్తులను తీసుకోవడం లేదు అని తెలిపింది.













