TTA: టీటీఏ అట్లాంటా ఛాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అట్లాంటా ఛాప్టర్ ఆధ్వర్యంలో అట్లాంటాలో బోనాల జాతర అత్యద్భుతంగా జరిగింది. ఈ పండుగ అద్భుతంగా జరిగిన నేపథ్యంలో టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, ఏసీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, ఏసీ మెంబర్స్ భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది తదితరులందరికీ టీటీఏ అట్లాంటా ఛాప్టర్ ధన్యవాదాలు తెలిపింది. భరత్ రెడ్డి మాదాడి, స్వాతి చెన్నూరి, ప్రభాకర్ మదుపతి, కార్తిక్ నిమ్మల, దీపిక రెడ్డి నల్లా, సుధీర్ కోత, వెంకట్ గడ్డం, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు దీప్తి యెలుగూరి, నిధీష్ భాస్కరుని, త్రిలోక్ గుంతుక, నర్సింగ్ వట్నాలా, స్వేత నిమ్మల, వాణీ గడ్డం, మురళీ, రోషి, శ్రీపాల్ ఇతర టీటీఏ ఆర్గనైజింగ్ టీం సభ్యులు, వాలంటీర్లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. భరత్ రెడ్డితోపాటు నర్సింగ్ రావు వట్నాల, ప్రభాకర్ ముధుపతి, దీపిక రెడ్డి నల్లా, త్రిలోక్ గుంటుక, నిధీష్ భాస్కరుని తదితరులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచానికి తెలియజేస్తాయని, ఇలాంటి కార్యక్రమాలతో కమ్యూనిటీని మరింత బలోపేతం చేయడం జరుగుతుందని టీటీఏ అట్లాంటా ఛాప్టర్ తెలియజేసింది.







