బోఇసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
బోఇసీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 6న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది బోఇసీ తెలుగు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పిల్లలు, పెద్దలు వినూత్న కార్యక్రమాలతో అలరించారు. ‘తేనెల తేటల మాటలతో’ అంటూ సభ్యులు సభ మొదలు పెట్టారు. పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ నృత్యాలు , తెలుగుదనం ఉట్టిపడే నృత్య మాలిక, మాస్, సెమి క్లాసికల్ నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ సంవత్సరం విశేషంగా కొన్ని పాటలకు పిల్లలే కోరియోగ్రఫీ చేసి తమ ప్రతిభను కనబరి చారు. అనంతరం తెలుగు వంటలతో భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఎంతో సరదాగా, సంబరంగా సాగింది.
ఈ వేడుకలు విజయవంతమవడానికి కృషి చేసిన వారిని మెమెంటోలతో సత్కరిం చారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. బోఇసీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ మంతెన మాట్లా డుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, భాష గొప్పదనాన్ని గుర్తుకు తెచ్చుకొని, మన పిల్లలతో పంచుకోవటమే అసోస ియేషన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యక్షులు సుబ్బు కొమ్మిరెడ్డి, కార్యదర్శి రమ్య తాతపూడి, కోశాధికారి ప్రదీప్‌రెడ్డి కొలను, నిర్వాహ కులు సాయి గిల్లా తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. పరిచయ కార్యక్రమంలో నూతన అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బు కొమ్మిరెడ్డి, ఉపాధ్యక్షురాలు రమ్య తాతపూడి, కార్యదర్శి ఎస్వీఆర్ ప్రసాద్, కోశాధికారి సందీప్ చలమలశెట్టి, నిర్వాహకులు వెంకట భార్గవ్ ఐనంపూడి తదితరులను పరిచయం చేశారు.













