జనవరిలో ఆటా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న భువనేష్ బూజాల
వచ్చే సంవత్సరం జనవరిలో లాస్‌వెగాస్‌లో జరిగే సమావేశాల్లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నట్లు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఉన్న భువనేష్ బూజాల తెలిపారు. కొత్త కార్యవర్గాన్ని కూడా ఈ సమావేశాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. కాగా లాస్ ఏంజెలిస్‌లో ఈ సంవత్సరం డిసెంబర్లో జరగనున్న మహాసభలను రద్దు చేశారు. ఈ మేరకు డెలావేర్లో జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. 2022లో ఆటా మహాసభలను అంగరంగ వైభవంగా వాషింగ్టన్ డీసిలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని కూడా అనుకున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు. ఆటాలో ట్రస్టీల పదవులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వీటిని పరిశీలించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల శరత్, ఆసిరెడ్డి కరుణాకర్, పాశం కిరణ్, రవి పట్లోళ్ల, తిరుపతిరెడ్ఞి యర్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













