సినీదిగ్గజాలకు బాటా సంగీతాంజలి
తెలుగు సినిమా రంగంలో పేరు పొందిన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, అలనాటి సినీనటి జమున, గాయని వాణీ జయరామ్‌ల మృతికి నివాళులర్పిస్తూ బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంగీతాంజలి సమర్పించింది. ఈ సందర్భంగా గాయనీగాయకులు వారి సినిమాల్లోని పాటలను పాడి అంజలి ఘటించారు. అలాగే గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు కూడా నివాళులర్పించారు. కృష్ణ రాయసం, శ్రీధర్ గణపతి, అనిక ప్రసాద్, మాల తంగిరాల, మాధవ్ దంతుర్తి, విజయ గోపరాజు, శ్రీని తగిరిశ, తిరుమలేశ్, అనూరాధ, ప్రేమ్ సాయి కార్తిక్, స్నేహ చతుర్వేదుల, శ్రీదివ్య యలమంచి, చేతన్ వాకడే, గిరీశ్ కులకర్ణి, గుర్మెల్ సింగ్, జీవన్ జుషి, అనన్య, ప్రభాకర్, నగేష్, హేమకుమార్, పొన్ని స్వామినాథ్ తదితరులు పాటలు పాడటంతోపాటు వారి అనుభవాలను తెలియజేశారు.
ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, బాటా మ్యూజికల్ గ్రూపు 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం వర్థమాన గాయనీ గాయకులకు ఇది వేదికగా ఉండాలన్నదేనని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కలవెంది ఫౌండేషన్ (ఐటిసిఎల్ఎ)కు చెందిన శ్రీనివాస మూర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బాటా కమిటీ
హరినాథ్ చికోటి (ప్రెసిడెంట్), కొండల్ కొమరగిరి (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి (సెక్రటరీ), వరుణ్ ముక్క (ట్రెజరర్), శివ కద (సెక్రటరీ)
స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి ఉన్నారు.
కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి మరియు తారక దీప్తి.
నామినేటెడ్ కమిటీ’ సభ్యులు హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు.
యూత్ కమిటీ సభ్యులు ఉదయ్, సంకేత్, ఆదిత్య, గౌతమి, హరీష్, సందీప్.
బాటా సలహా సంఘం నాయకులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సక్సెస్ చేసిన టీమ్‌ను అభినందించారు.













