బ్రిటన్‌లో పది ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ పండుగను బ్రిటన్‌లో పది ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ పోస్టర్‌ను జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ఆమె నివాసంలో ఆవిష్కరించారు. గత ఏడాది ఏడుచోట్ల నిర్వహించగా, ఈ సారి పది ప్రాంతాల్లో బతుకమ్మ నిర్వహిస్తున్నది. పది పల్లెల బతుకమ్మ.. పదికాలాల బతుకమ్మ నినాదంతో నిర్వహిస్తున్నట్టు జాగృతి యూకే అధ్యక్షుడు పవన్ బల్మూరి తెలిపారు. చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బతుకమ్మతో వచ్చిన ఆడబిడ్డలకు నారాయణపేట చేనేత చీరలను అందచేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి, కోరబోయిన విజయ్, రోహిత్‌రావు, ప్రశాంత్ పూసా, నితీష్ వాడ్రేవు పాల్గొన్నారు.













