బే ఏరియాలో ఘనంగా ప్లవ ఉగాది వేడుకలు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో ప్లవ నామసంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా ఏప్రిల్ 10వ తేదీన వైభవంగా నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఈసారి వేడుకలను వర్చువల్‌గా నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి పోటీలను ప్రారంభించారు. యూత్ టాలెంట్ షో పేరుతో డ్యాన్సింగ్, సింగింగ్, స్పెషల్ టాలెంట్ పోటీలను జరిపారు. సాంస్కృతిక వేడుకలు రాత్రి 9 వరకు జరిగాయి. ఈ వేడుకలకు బిజినెస్ కమ్యూనిటీ మద్దతును ఇచ్చాయి. సంజయ్ ట్యాక్స్ ప్రో కార్యక్రమాన్ని ప్రజంట్ చేసింది. శ్రీని గోలి రియల్ ఎస్టేట్, అపెక్స్ కన్సల్టింగ్, పిఎన్జి జ్యూవ్వెల్లర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. విరిజల్లు రేడియో మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది. కాగా ఈసారి పోటీల్లో దాదాపు 100 మందికిపైగా పాల్గొన్నారు. చిన్నారులు, పెద్దలు, యువతీయువకులు ఇందులో ఉన్నారు. క్లాసికల్, జానపదం, ఫిల్మ్ గీతాలను కొందరు ఆలపించారు. కొందరు తమ నృత్య ప్రతిభను ప్రదర్శించారు. మరికొందరు తమ ప్రత్యేకమైన టాలెంట్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అందరూ మంచి ప్రతిభను కనబరచడంతో న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేయడానికి ఇబ్బందులు పడ్డారు.
సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు, ఇతరులకు స్వాగతం పలికారు. అశ్వలాయన మహర్షి ఋగ్వేద పరిషత్ వారు పంచాంగ శ్రవణం, ఆశీర్వచనం చేశారు. ఆనందభైరవి పేరుతో జరిగిన క్లాసికల్ డ్యాన్స్ పోగ్రామ్‌లో గురు హిమబిందు చల్లా, గురు శ్రీవిద్యాదైత పాల్గొన్నారు. లిదియా కొట్లోవా పియానోపై పాడిన జాబిల్లి కోసం పాట ఆకట్టుకుంది. నవతరంగం పేరుతో బాటా యువ టీమ్ హుషారెత్తించే డ్యాన్స్‌లు చేసింది. ఖుషీఖుషీగా పేరుతో జరిగిన కార్యక్రమంలో శ్యామహరిణి చేసిన కామెడీ అందరినీ నవ్వించింది. యువతరంగం పేరుతో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ సింగర్ శ్రీకృష్ణ పాటలను పాడారు. బాటా ఆధ్వర్యంలో ఎస్పిబి కచేరీలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎస్పిబికి నివాళులు అర్పిస్తూ ఆయన పాడిన పాటలను పాడారు.
బాటా ప్రెసిడెంట్ యశ్వంత్ కుదరవల్లి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన వారందరికీ, తన హయాంలో అన్నీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
బాటా కొత్త కార్యవర్గాన్ని ఈ కార్యక్రమంలోనే ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా హరినాథ్ చికోటి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాటా టీమ్ సభ్యులందరితో కలిసి కార్యక్రమాలు నిర్వహిసాత•్నని, బాటా 50వ వార్షికోత్సవ వేడుకలను వచ్చే సంవత్సరం ఘనంగా నిర్వహించడానికి ప్లానింగ్ చేయనున్నట్లు చెప్పారు.













