భారత సంతతి నటుడికి తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు
భారత సంతతి నటుడికి తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ యేటి వేడుకల్లో అజిజ్ అన్సారీ టీవీ సిరీస్లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ద మాస్టర్ ఆఫ్ నన్ అన్న కామిడీ సిరీస్లో అజిజ్ అన్సారీ(34) నటించాడు. అవార్డును గెలుచుకోవడం సంతోషంగా ఉందని అజిజ్ తెలిపారు. నెట్ఫ్లిక్స్లో ద మాస్టర్ ఆఫ్ నన్ సిరీస్ వస్తోంది. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయ్యాడు. కానీ ఈ సారి అన్సారీ అవార్డును గెలుచుకోవడం విశేషం. కామిటీ క్యాటగిరీలో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి ఆసియా నటుడు కూడా ఇతనే. ఆంధోనీ అండర్సన్, కెవిన్ బీకన్, విలియమ్ మాకీ, ఎరిక్ మెక్కార్మాక్ నుంచి అన్సారీ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు.













