TANA: తానా మహాసభల్లో ఎయు పూర్వ విద్యార్థుల సమ్మేళనం
తానా (TANA) 24వ మహాసభల్లో భాగంగా అలూమ్ని కమిటీ, తానా నాయకురాలు డా. ఉమ ఆర్ కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ అలూమ్ని సమావేశం పూర్వ విద్యార్థుల సమక్షంలో అత్యంత ఉత్సాహంగా, విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు హాజరై సందడి చేశారు. వారిలో ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోంగు, తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, తానా కాన్ఫరెన్స్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా మాజీ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, డా. వాసుబాబు గోరంట్ల, న్యూక్లియర్ ఫిజిక్స్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భాస్కర్ కటికి, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విజయ్ గుడిసేవ, ఈ ఈవెంట్ కోఆర్డినేటర్, తెలుగు విభాగం నుండి డా. గీతా మాధవి, తానా ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల), తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా తమ కళాశాల రోజుల జ్ఞాపకాలను ఒకరితో మరొకరు పంచుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. ముఖ్య అతిథులను డా. ఉమ. ఆర్. కటికి (ఆరమండ్ల), అంజయ్య చౌదరి లావు ఘనంగా సన్మానించారు. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీతో పాటు అనుబంధ కళాశాలల నుండి కూడా అనేకమంది పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారంతా ఒకే వేదికపై కలుసుకోవడం, తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
డా. ఉమ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 2026లో జరగనున్న శతాబ్ది ఉత్సవాలకు తప్పకుండా హాజరై, విశ్వవిద్యాలయానికి మీ మద్దతును అందించాలి’ అని పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల మధ్య బంధాలను మరింత పటిష్టం చేసిందని, పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.







