ఎటిసి అవార్డుల కోసం దరఖాస్తు చేయండి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌కు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. మే 31 నుంచి జూన్ 2 వరకు డల్లాస్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్‌కోసం?వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా కమ్యూనిటీలో ప్రముఖులైన వారికి అవార్డులను ఇవ్వాలని అవార్డుల కమిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది. బిజినెస్, కమ్యూనిటీ సేవ, సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషి, జర్నలిజం, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, యూత్ రంగంలో ప్రతిభను చూపినవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అవార్డుల కమిటీ చైర్ డా. రాజేశ్వర్‌రావు టెక్మల్ తెలిపారు. ఇతర వివరాలకు ఈ ఫ్లయర్‌ను చూడవచ్చు.













