ఆటా ‘‘ఝుమ్మంది నాదం’’ సీనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” సీనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను జులై 12, 19 తేదీలలో ఆన్ లైన్ లో జూమ్ ద్వారా నిర్వహించింది. దాదాపుగా 65 మంది గాయని గాయకులు అమెరికా పలురాష్ట్రాలనుండి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ. రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ, శ్రీమతి. శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.
అమెరికా మరియు ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ.. రాజ శేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్ మరియు సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ కుమారి. నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ. వేణు శ్రీరంగం, సింగర్, లిరిసిస్ట్ మరియు ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ శ్రీ. పివియెన్ఎస్ రోహిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆటా సంస్థ సీనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులు, 1. అపరాజిత పమిడిముక్కల, 2. చైత్ర ఆర్ని, 3. జ్యోత్స్నా ఆకుంది, 4. కార్తిక్ స్వామి, 5.మైన ఏదుల, 6. ప్రణవ్ అర్కటాల, 7.ప్రణవ్ బార్ల, 8. ప్రియాంక కొలనుపాక, 9.శృతి శేఖర్, 10. శ్రీప్రజ్ఞ వెల్లంకి, 11. సుదార్చిత్ సొంటి, 12. తేజశ్రీ మేక, 13. వాదిరాజ్ గార్లపాడ్ వ్వాషింగ్టన్, న్యూ జెర్సీ, టెక్సాస్ , నార్త్ క్యారలిన, జార్జియా, ఆరిజోనా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా, మిన్నిసోటా రాష్ట్రాల నుండి “ఫైనలిస్ట్స్ గా” ఎంపిక చేసారు.
ఆటా ప్రెసిడెంట్ శ్రీ. పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝుమ్మంది నాదం టీం మరియు, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్స్ అందరికి అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం. ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలు ఆగష్టు 2, 2020 వరకు ఫైనల్స్ ఆగష్టు 8,2020 నుండి ఆగష్టు 9 వరకు కొనసాగిస్తారు.
ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవి, మన టీవి ఇంటర్నేషనల్, టీవి 5 , జి .యెన్. యెన్ , ఏ. బి. ర్ ప్రొడక్షన్స్ , అలాగే తెలుగు యెన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఝుమ్మంది నాదం పాటల పోటి విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ. పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు.
Click here for ATA Jummandi Naadam Seniors List













