అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
వాషింగ్టన్ డీసీ లోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. 200 ఇండియన్ సీనియర్ సిటిజన్స్ మరియు ప్రవాస భారతీయులు (తెలుగు ఎన్ఆర్ఐ) పాల్గొని వివిధ రకాల స్పెషలిస్ట్ లతో చెకప్ చేయించుకోని వారి ఆరోగ్య సమస్యలను విన్నవించుకున్నారు. జాయింట్ ఫార్మసీ వారు బ్లడ్ టెస్ట్ స్టాల్ ని ఏర్పాటు చేసి బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్‌ను వెంటనే పేషెంట్స్‌కు అందించారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని తమ రిజల్ట్స్ తో స్పెషలిస్ట్స్ తో చూపించుకోవడం జరిగింది.
ఉదయం 9 గంటలకు యోగాతో ప్రారంభమైన శిబిరం, మెడిటేషన్, మరియు హెల్త్ న్యూట్రిషన్ ప్రెసెంటేషన్ తో ముగిసింది. వివిధ రకాల నిపుణులైన వైద్యులు పాల్గొని సేవలందించారు. దాదాపుగా 20 మంది డాక్టర్స్ పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సక్సెస్ చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క డాక్టర్ కి అట లీడర్షిప్ కృతజ్ఞతలు తెలిపారు మరియు మెమెంటో లతో సన్మానించారు.
వచ్చిన అతిథులకు అట టీం మార్నింగ్ రుచికరమయిన బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాలొ ్గన్న వైద్య బృందానికి అట సెక్రటరీ సౌమ్య కొండపల్లి, బోర్డు అఫ్ ట్రస్టీ జయంత్ రెడ్డి చల్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్ బృందానికి రీజినల్ కో ఆర్డినేటర్స్ అమరేందర్ బొజ్జ, సుధీర్ బండారు మరియు రాంమోహన్ సూరనేని.
డాక్టర్ వెంకట్ అధ్వర్యంలో లోని జాయింట్ ఫార్మసీ బృందానికి అట నెట్వర్క్ డైరెక్టర్స్ డాక్టర్ వెంకట్ అందకి, జయేందర్ అన్నం, కౌశిక్ సామ మరియు రవి పళ్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేయడానికి అట వాలంటీర్స్ మూడు నెలల నుంచి కృషి చేశారు.













