అట్లాంటాలో ఆటా వైద్య శిబిరానికి భారీ స్పందన
అమెరికా తెలుగు సంఘం (అటా) ఆధ్వర్యంలో ఆక్టోబర్ 14వ తేదీన అట్లాంటాలోని హిందూ దేవాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సాయి హెల్త్ ఫేయిర్, జార్జియా ఇండియన్ నర్స్ అసోసియేషన్లు సహకారాన్ని అందించాయి. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక విభాగాల్లో నిష్టాతులైన 20 డాక్టర్లు, చాలామంది డాక్టర్లు, వాలంటీర్స్ పాల్గొని సేవలు అందించారు. ఈ వైద్య శిబిరాని దాదాపుగా 200 మందికి పైగా పాల్గొని ఉచిత సేవలు పొంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డయాబెటిక్, న్యూట్రిషన్, హైపర్ టెన్షన్, ధూమపానం వల్ల వచ్చే నష్టాలను ఆ రంగంలో నిష్టాతులైన డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొప్ప యోగ మాస్టర్‌తో యోగా సెషన్ కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత రెడ్డి, డాక్టర్ సిమాలా, ఎర్రమల్, డాక్టర్ శ్రీనిగంగాసనీ, దక్షిణప్రాంతంలోనే ప్రొఫెషనల్ డాక్టర్లు ఈ శిబిరాన్ని ముందుండి నడిపించారు. అంతేకాక గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజి, డెర్మటాలజీ వివిధ రంగాల్లో నిపుణులైనా 20 మంది డాక్టర్లు పరీక్షలు జరిపి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యం అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్లందరీకి అటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అంతేకాక ఈ కార్యక్రమానికి ఆడిటోరియం ఇచ్చిన హిందూ ఆలయ బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.













