విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ అందిస్తున్న ఆటా

విద్యార్థులను ఉన్నత విద్యలవైపు ప్రోత్సహించడంతోపాటు వారి జాబ్ స్కిల్స్‌ను మెరుగుపరిచేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) స్కాలర్‌షిప్స్, ఇంటర్న్‌షిప్స్‌ను అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ అడ్మిషన్స్, కెరీర్ కౌన్సిలింగ్‌లో విశేష అనుభవం ఉన్న రవి లోతుమల్లతో కౌన్సిలింగ్ సెషన్ నిర్వహిస్తోంది. ఆగస్టు 3వ తేదీ అంటే శనివారం ఉదయం 11 గంటల (ఈఎస్టీ) నుంచి 12.30 వరకు ఈ సెషన్ జరగనుంది. విద్యార్థులు తమ కాలేజ్ అడ్మిషన్స్, కెరీర్ గురించి ఎలాంటి సందేహాలున్నా ఈ కౌన్సిలింగ్‌లో సమాధానాలు పొందవచ్చు. విద్యార్థులకు ఉపయోగపడే ‘స్టడీ అబ్రాడ్ మరియు ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్స్’ గురించి కూడా ఈ సెషన్‌లో రవి లోతుమల్ల వివరిస్తారు. ఈ కౌన్సిలింగ్ సెషన్‌ను ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేనున్నారు. ఫేస్‌బుక్ లైవ్ కోసం https://www.facebook.com/AmericanTeluguAssociation లింకును, యూట్యూబ్ లైవ్ కోసం https://tinyurl.com/ATAEDU2024 లింకును సందర్శించాలి. ఈ వెబినార్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకునేవారు webinarata@gmail.com ను సంప్రదించవచ్చు.