ATA: ఆస్టిన్‌లో ఆటా 5కె వాక్ విజయవంతం

అమెరికా తెలుగు సంఘం (ATA) ఆస్టిన్ టీం ఆధ్వర్యంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే, లేక్‌వుడ్ పార్క్, లీనాండర్ (Texas) లో మరో 5కె వాక్‌థాన్ ను విజయవంతంగా నిర్వహించారు. నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఈ వాక్‌థాన్‌లో 200మంది పాల్గొనడం విశేషం. పురుషులు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్స్ విభాగాలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికీ ఉచిత బ్రేక్‌ఫాస్ట్, ఎనర్జీ డ్రిరక్స్, వాటర్ అందించబడింది.
ఈ సందర్భంగా ఆటా బోర్డు ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సి రెడ్డి గడ్డికొప్పులా, వెంకట్ మంతెన మాట్లాడుతూ, రాబోయే ఆటా ఈవెంట్స్, మెంబర్‌షిప్ ప్రయోజనాలను వివరించారు. రీజినల్ డైరెక్టర్ సంగమేశ్వర్ రెడ్డి సభ్యులుకాని వారిని ఆటాలో చేరమని ఆహ్వానిస్తూ, సంఘం లక్ష్యం తెలుగు భాష, సంస్కృతిని కాపాడటం మరియు ప్రోత్సహించడం అని తెలియజేశారు.
ఆటా స్థానిక బృందం సంగమేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ చక్కా, షీతల్ గంపవార్, సైలజ కొమటి, ఆనంద్ యాపర్ల, రాజశేఖర్ బెరిటోలు యూత్ వాలంటీర్స్: ఈషా తిగిరెడ్డి, జశ్వంత్ జగదీశన్, యశ్వంత్ యాపర్ల, హర్షిణి మన్హెన, ఆర్కిత రెడ్డి లాంబు ఈ వాక్‌థాన్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్క పాల్గొన్నవారికి, వాలంటీర్స్‌కి మరియు స్పాన్సర్స్‌కి ఆటా ఆస్టిన్ టీం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.