అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం
అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తు కమల (26) గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.













