అక్టోబర్ నెలలో అమెరికాలో పర్యటించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి అమెరికాలో పర్యటించనున్నారు. అక్టోబర్ 9 నుంచి 12 వరకు ఆయన పర్యటన ఉంటుందని వార్త. ముఖ్యమంత్రి హోదాలో మే నెలలో ఆయన అమెరికాలో పర్యటించినప్పుడు ఐయోవా (లోవా) స్టేట్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందం చాలా కీలకం కానుంది. విత్తనోత్పత్తి, మేలైన వంగడాల ఎంపిక, సరైన సస్వరక్షణ చర్యలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వంటి అంశాలపై అవగాహన వచ్చింది. ఈ ఒప్పందం వల్ల వ్వవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతోంది. ఘనా, పెరూ, దేశాల్లో ఉన్న విత్తన పరిశోధనా కేంద్రం త్వరలోనే అమరావతికి రానుంది. వ్యవసాయాభివృద్ధిలో ఇది కీలకం కానుంది.
ఐయోవా నగరంలో నది ఒడ్డున ఉన్న ఐయోవా యూనివర్సిటీ నుండి చంద్రబాబునాయుడు ప్రత్యేక అవార్డును కూడా అందుకోనున్నారు. ఆయన చేస్తున్న సేవలకు మెచ్చి ఈ అవార్డు నివ్వనున్నారు. 1847లో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఐయోవా యూనివర్సిటీ నాణ్యమైన విద్యనందించడంలో మంచిపేరు పొందింది. మరోసారి అక్కడ అడుగు పెట్టే చంద్రబాబు నాలుగు రోజుల పాటు ఉండనున్నారు. చికాగో నగరంలోనూ ఆయన పర్యటించే అవకాశముంది.













