సెప్టెంబర్ 23న అమెరికా రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో న్యూయార్క్లో సెప్టెంబర్ 23 నుంచి జరిగే సహజ సిద్ధ వ్యవసాయంపై జరిగే సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయంలో పురుగుమందులను తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరంపై ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి తన అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 23వ తేదీన ఎపిఎన్ఆర్టీ, ఎన్నారై టీడిపి ఇతర సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26వ తేదీన అమెరికా వ్యాపారవాణిజ్య ప్రముఖులతోనూ, భారతీయ సంతతి ప్రముఖులతోనూ సమావేశమవుతారని తెలిసింది.













