అమెరికా పర్యటనలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ట్టుబడి ఉందని అమెరికా పర్యటనలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కొలంబస్లో జరిగిన బీజేపీ అభిమానుల సమావేశంలో కన్నా మాట్లాడారు. తొలి నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా వల్ల జరిగిందేమీ లేదని చెప్పటమే కాకుండా వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సన్మానాలు, సత్కారాలు చేసి హోదా గురించి మాట్లాడిన వారిని అరెస్టు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ ధర్నా చేస్తుంటే ఎగతాళి చేసిన బాబు నేడు ధర్నాకు కూర్చొవడం దారుణమన్నారు. న్యూజర్సీ, న్యూయార్క్, పిట్స్బర్గ్, బ్లాటిమోర్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో జరిగే బీజేపీ సమావేశాల్లో కన్నా పాల్గొంటారు.













