AAA: మార్చి 28,29 తేదీల్లో ఫిలడెల్ఫియాలో ఎఎఎ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా ఫిలడెల్ఫియాలో మహాసభలను మార్చి 28,29 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్‌షో, శ్రీనివాస కళ్యాణం, మీట్ అండ్ గ్రీట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత విభావరి వంటి ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
ఫిలడెల్ఫియాలో మరో తెలుగు పండుగ ఘనంగా జరగనున్నది. ఆంధ్రులకోసం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల అభివృద్ధికోసం అమెరికాలోని ఎన్నారై ఆంధ్రులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున మహాసభలను నిర్వహిస్తోంది. మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పలు రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర రంగాల ప్రముఖులు తరలివస్తు న్నారు. అలాగే సినీరంగానికి చెందిన పలువురు కళాకారులు హీరో, హీరోయిన్లు, ఇతర తారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి ఈ మహాసభల్లో హైల్కెట్గా నిలవనున్నది. ఇప్పటికే ఈ మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఐక్యతను పెంచేందుకే మహాసభలు
ఎఎఎ వ్యవస్థాపకుడు హరి మోతుపల్లి
అమెరికాలో ఉంటున్న ఆంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడంకోసమే ఈ మహాసభలను ఏర్పాటు చేశాము. ఇది ఆంధ్రుల శక్తివంతమైన వేదిక. తెలుగు సంస్కృతి, వ్యాపార అనుసంధానం, యువత, మహిళా సాధికారత సాధించడమే ఈ మహాసభల ముఖ్య లక్ష్యం. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని అభివృద్ధి చేయడం, సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించడం. మన తెలుగు సంస్కృతి, కళలు, భాష, సంప్రదాయాలను పదిలపరచడానికి ఎఎఎ వేదికగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని తెలిపేలా మహాసభలు
ఎఎఎ అధ్యక్షుడు బాలాజీ వీర్నాల
అమెరికాలోని ప్రవాసాంధ్రులను ఐక్యం చేసేందుకు, వారి సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నాము. ఈ మహాసభలు తెలుగువారి వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే గొప్ప వేదికగా నిలవనుంది. తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ, ఆంధ్రప్రదేశ్ మూలాలను అమెరికాలో బలంగా నిలపడానికి మార్గదర్శకంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నాము.
ఆంధ్రుల పండుగలా మహాసభలు
హరిబాబు తూబాటి, నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహాసభలు ఆంధ్రుల పండుగలా నిర్వహిస్తున్నాము. అమెరికాలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నీ జిల్లాల వాసులను ఏకం చేసేలా ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మన పిల్లలకు చూపడం, అమెరికాలో విస్తృతంగా వ్యాప్తి చేయాలన్న ఉదేశ్యంతో మహాసభల కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చాము. ఈ మహాసభలకు అమెరికా అంతటా ఉన్న ఆంధ్రులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను.
కన్వెన్షన్ కమిటీ
ఈ మహాసభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు, వివిధ కార్యక్రమాలను రూపొందించేందుకు కన్వెన్షన్ కమిటీని ఎఎఎ నాయకులు ఏర్పాటుచేశారు. బాలాజీ వీర్నాల (నేషనల్ ప్రెసిడెంట్, ఫండ్ రైజింగ్ టీమ్), హరిబాబు తూబాటి (నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్, డే 2 కన్వీనర్), కళ్యాణి గొట్టిపాటి (కన్వెన్షన్ కో ఆర్డినేటర్), సత్య వెజ్జు (డే 1కన్వీనర్), రవిచిక్కాల (డే 1 కో కన్వీనర్), ప్రదీప్ సెట్టి బలిజ (డే 2 కో కన్వీనర్), కళ్యాణ్ ఆచంట (కన్వెన్షన్ ఎగ్జిబిట్స్ %`% వెండర్ స్టాల్స్ అండ్ షాప్స్), జగదీశ్ దారా (కన్వెన్షన్ సావనీర్ టీమ్), గిరిధర్ రెడ్డి మందపాటి (ట్రజరర్), ఆది వెంకట వైకుంఠ గుప్తా పబ్బతి (డెకరేషన్ టీమ్), పవన్ కోటెపల్లి (డే 1 కల్చరల్ టీమ్), అశోక్ బుదమ(డే 2కల్చరల్ టీమ్), హరిక పెద్దిరెడ్డి (డే 1 స్టేజి కో ఆర్డినేషన్ టీమ్), మృదుల నుదురపాటి (డే 2 స్టేజి కో ఆర్డినేషన్ టీమ్, డే 2 పూజటీమ్), అజయ్ శిఖరం (డే 1 ఫుడ్ అండ్ డ్రిరక్స్ టీమ్), అంజన్ (డే 2 ఫుడ్ టీమ్), కృష్ణ మలినేని (డే 1 కిడ్స్ యాక్టివిటీస్ టీమ్), జ్యోతి విన్నకోట (డే 2 కిడ్స్ యాక్టివిటీస్), భాస్కర్ మలినేని (డే 1 వలంటీర్స్ టీమ్), రాధాకృష్ణ ముల్పురి (డే 2 వలంటీర్స్ టీమ్), సుధ కథ (డే 1 యూత్ వలంటీర్స్ టీమ్), శ్రీదేవి అక్షయపాత్ర (డే 2 యూత్ వలంటీర్స్ టీమ్), దన్ దందూరి (డే 2 యూత్ వలంటీర్ టీమ్), ఉష అలిగేషన్ (ఫస్ట్ ఎయిడ్), త్రినాధరాజు రుద్రరాజు (మెమోంటోస్ అండ్ శాలువా, ట్రోఫీస్ టీమ్), షణ్ముఖ ఆనంద్ దావులూరు (టేబుల్, చ్కెర్ మేనెజ్మెంట్ టీమ్), పుట్ట జ్యోతిలహరి (ఇన్ఫర్మేషన్, ఎంక్వయిరీ సెంటర్ టీమ్), నవీన్ కట్టమర్రి(రిజిస్ట్రేషన్స్ టీమ్), సూర్యమారెళ్ళ (మీడియా అండ్ కమ్యూనికేషన్స్ టీమ్), హర్ష ప్రతాప్ (ఫిలిం, ఫోటోగ్రఫీ టీమ్), శ్రీకాంత్ ఎల్లమెల్లి (ఆడియో, వీడియో టీమ్), శ్రీనివాస్ ఆదిమూలం (హోటల్ మేనెజ్మెంట్ టీమ్), శ్రీనివాస్ అద్ద (హాస్పిటాలిటీ టీమ్), భాస్కర్ రెడ్డి కల్లూరి (హాస్పిటాలిటీ టీమ్), రవితేజ రెడ్డి మారినేని (హాస్పిటాలిటీ టీమ్), అశ్విన్ ధనియాల (హాస్పిటాలిటీ టీమ్, ఇన్విటేషన్స్ టీమ్), కార్తిక్ బుడిగె (ట్రాన్స్ పోర్టెషన్ టీమ్), హుస్సేన్ భాషా షేక్ (ట్రాన్స్‌పోర్టేషన్ టీమ్) షకీల్ అహ్మద్ (సెక్యూరిటీ టీమ్), ముఖేష్ సుంకరి (పార్కింగ్ టీమ్), శ్రీనివాస ఉప్పల (సప్లయిస్ టీమ్), తిరుపతిరావు బీరపునేని (సప్లయిస్ టీమ్), అరిజోనా ఎఎఎ టీమ్ (సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ సైట్ టీమ్), పాపిరెడ్డి అన్నపురెడ్డి (డే 1 పోస్ట్ వ్రాప్ అప్ టీమ్), వంశీ పసుపులేటి (డే 2 పోస్ట్ వ్రాప్ అప్ టీమ్, షార్ట్ ఫిలింస్ కాంపిటీషన్స్ చైర్మన్), వీరభద్రశర్మ కూనపులి (ముగ్గుల పోటీ టీమ్ చైర్మన్), వెంకటరాజు కలిదింది (మ్యూజిక్ కాంపిటీషన్స్ చైర్మన్), శ్వేత వాసగిరి (రీల్స్ కాంపిటీషన్స్ చైర్ఉమెన్).







