ATA: అక్టోబర్ 5న అమెరికన్ తెలుగు అసోసియేషన్ దసరా వేడుకలు

అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో దసరా వేడుకలను (Dasara Celebrations) అక్టోబర్ 5న ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేడుకల కోసం భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని (ATA) ఆర్గనైజర్లు కోరుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి (ATA) ప్రాంతీయ సమన్వయకర్తలు, కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆటా (ATA) ప్రాంతీయ సమన్వయకర్తలు కృష్ణమోహన్ ములే, ప్రదీప్ కట్ట, ప్రసాద్ అకులతో పాటు మహిళా కమిటీ చైర్ గీత రెడ్డి (Geetha Reddy) నాయకత్వంలో వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ (Dasara Celebrations) వేడుకల నిర్వాహణలో శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు, విజయ్ కుండూరు, సంతోష్ రెడ్డి, డా. పరశురామ్ పిన్నపురెడ్డి, రఘువీర్ రెడ్డి, శరత్ వేముల, రాజ్ చిలుముల, రాజేందర్ జిన్న, పరమేశ్ భీంరెడ్డి, సుధాకర్ పీసపాటి, రవీందర్ గొడురు, విలాస్ జంబుల, రమేష్ మాగంటి, రామ్ వేముల, రాంగోపాల్, రవి పెద్ది, హరీష్ మణి, ప్రవీణ్ ఆలా, శ్రీకాంత్ తుమ్మల వంటివారు చురుగ్గా పాల్గొంటున్నారు.