అమెరికన్ ప్రొఫెసర్‌కు ఆర్థిక నోబెల్
ఈ ఏడాది ఆర్థిక నోబెల్ అమెరికాకు చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ హెచ్ థేలర్‌కు దక్కింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బిహేవియరల్ ఎకనమిక్స్‌పై ఆయన అధ్యయనానికి గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. 72 ఏళ్ల థేలర్, న్యూజెర్సీలోని ఈస్ట్ ఆరెంజ్‌లో జన్మించారు. ఎకనమిక్స్‌ను సైకాలజీకి లింకు చేస్తూ ఆయన రాసిన థియరీ నోబెల్ ప్రశంసలు అందుకుంది. సామాజిక ప్రాధాన్యతలు, స్వీయ నియంత్రణ ఓ వ్యక్తి నిర్ణయాలను, మార్కెట్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయాలను థేలర్ తన అధ్యయనాల ద్వారా వెలికితీశారు. మార్కెటింగ్ ట్రిక్స్ దెబ్బతీసే ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా థేలర్ అధ్యయనాలు బాగా పనికొస్తాయని నోబెల్ కమిటీ కొనియాడింది. అసలు సంబంధం లేని, ఎవరూ ఊహించని విషయాలే ఆర్థిక సంబంధమైన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయంటూ 2015లో థేలర్, అన్లెస్ యు ఆర్ స్పాక్ పాపులర్ పుస్తకాన్ని రాశారు.













