ఆ కంటైనర్ ను వెనక్కి పంపాం : అమెరికా
భారత్ నుంచి ఎగుమతి అయిన అల్యూమినియం కడ్డీల లోడ్లో గడ్డి చిలుక రావడంతో అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ అధికారులు (సీబీపీ) ఆ సరుకును తిప్పి పంపారు. పెన్సిల్వేనియాలోని డెలావేర్ లోయలో మునుపెన్నడూ ఈ కీటకం కనిపించలేదని అమెరికా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. మార్చి 11న భారత్ నుంచి వచ్చిన అల్యూమినియం కడ్డీల కంటైనర్లో గడ్డి చిలుక వచ్చిందని అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ రంగంలోని వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ఆ కంటైనర్ను వెనక్కి పంపాం అని సీబీపీ పేర్కొంది. పంటలను నాశనం చేసే ఇలాంటి కీటకాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా సీబీపీలోని వ్యవసాయ నిపుణులు అడ్డుకుంటారని సీబీపీ డైరెక్టర్ కాసీ డర్టస్ వెల్లడించారు.













