అమెరికాలో ఘనంగా సౌదీ అంబాసిడర్ కుమారుడి పెళ్లి
సౌదీ అరేబియాలో భారతీయ అంబాసిడర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఔసఫ్ సయీద్ పెద్ద కుమారుడు ఫతేహ్ సయీద్ వివాహం అమెరికాలోని చికాగోలో వైభవంగా జరిగింది. అంబాసిడర్ ఔసఫ్ సయీద్ స్వస్థలం హైదారాబాద్. జలీల్ అహ్మద్ సగీర్ కుమార్తె అస్మా అహ్మద్‌ను ఫతేహ్ పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన చికాగోలోని బటర్ఫీల్డ్ రోడ్డున ఉన్న కార్ల్సీబటర్ఫీల్డ్ బాంక్వెట్ హాల్లో వెడ్డింగ్ సెర్మనీ జరిగింది. 26వ తేదీన చికాగోలోనే వలీమా రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది. అమెరికాలోని డీపాల్ యూనివర్సిటీలో ఫతేహ్ సయీద్ ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు. సివిల్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ఆయన స్థాపించాడు. కోవిడ్ నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో కుటుంబసభ్యులు, స్నేహితులు పెళ్లి, వలీమా వేడుకలకు హాజరయ్యారు. వేడుకకు హాజరైన అతిథులు వధూవరులను ఆశీర్వదించారు.













