కెనడా ఎన్నికల్లో తెలుగువాళ్ల విజయం
కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడికి చెందిన ప్రసాద్ పాండా, విజయనగరం మూలాలు కలిగిన లీలా అహీర్ యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ (యుసీపీ) తరపున విజయ పతకం ఎగురవేశారు. వీరిద్దరూ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ నెల 16న అల్బెర్టా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 87 స్థానాల అసెంబ్లీలో యూసీపీ 64 సీట్లు గెలిచి అధికారం చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు జాసన్ కెన్నీ ముఖ్యమంత్రి కానున్నారు. లీల తండ్రి విజయనగరం జిల్లా వాసి అని తెలుస్తోంది. ఆమె ఎడ్మంట్లో జన్మించారు. గత జనవరిలో విజయనగరాన్ని సందర్శించారు. ఆమె భర్త అహీర్ పంజాబ్ సంతతికి చెందినవారు.













