అక్కినేని పురస్కారాలు
అక్కినేని ఐదో అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం (22వ తేదీన) జరగనుంది. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4:30 గంటలకు కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఎఫ్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కృషి, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మస్థైర్యంతో అద్భుత విజయాలు సాధించవచ్చని అక్కినేని నాగేశ్వరరావు రుజువు చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో నాలుగేళ్లుగా ఈ అవార్డులు అందజేస్తున్నామని చెప్పారు. ఏఎఫ్ఏ అధ్యక్షుడు రావు కల్వల మాట్లాడుతూ ఈ ఏడాది జీవన సాఫల్య పురస్కారాన్ని సినీనటి జమునకు, సినీరత్న పురస్కారాన్ని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు, సేవారత్న పురస్కారాన్ని పద్మశ్రీ వనజీవి రామయ్యకు అందజేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని పురస్కారాల వివరాలు. విద్యారత్న మాజీ ఎమ్మెల్స ప్రొఫెసర్ కె.నాగేశ్వర్,వ్యాపారరత్న పవర్ మెక్ కంపెనీ సజ్జా కిషోర్‌బాబు, రంగస్థల రత్న తిరుపతి సంగీత కళాశాల హరికథా విభాగాధిపతి డాక్టర్ ముప్పవరపు నరసింహశాస్త్రి, వైద్యరత్న ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, వినూత్నరత్న చిత్రకారిణి డాక్టర్ కమలాప్రసాదరావు, యువరత్న కరాటే క్రీడాకారుడు చేరుపల్లి వివేక్ తేజ.













