పోలీసులను చంపితే మరణశిక్షే : ట్రంప్
పోలీసు అధికారులను చంపిన వారికి మరణశిక్ష విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. లాస్ఏంజిల్స్, కాంప్టన్ ప్రాంతానికి చెందని ఇద్దరు పోలీసు అధికారులపై గుర్తు తెలియన వ్యక్తి దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు ఆదివారం నెవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తుపాకీ ధరించిన ఓ గుర్తుతెలియని దుండగుడు పోలీసు వాహనంపై కాల్పులు జరిపాడు. ఆకారణంగా అతను ఈ దుర్మార్గానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ వాహనం వద్దకు వెళ్లిన దుండగుడు పోలీసులపై దాడి చేశారు. వారి పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా ఉంది. అతను మనిషి అని ఎవరైనా అనవచ్చు. కానీ కాదు.. అతను పశువుతో సమానం. అతన్ని నేను పశువు అనే పిలుస్తాను అని వెల్లడించారు. ఈ డాదిలో 24 ఏళ్ల అధికారి, 31 ఏళ్ల మహిళా అధికారి తీవ్రంగా గాయపడ్డారు. వారికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. వీరు గత సంవత్సరమే విధుల్లో చేరినట్టు తెలిసింది. కాగా, పరారిలో ఉన్న నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల బహుమానం ప్రకటించారు.













