ట్రంప్ సర్కారుపై చర్యలు తీసుకోవాలి : ఏసీఎల్యూ
శరణార్థుల పట్ల డొనాల్డ్ ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న తీరును అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ) తప్పుపట్టింది. గతేడాది ఇమిగ్రేషన్ అధికారులు 900 మంది చిన్నారులను నిర్బంధ కేంద్రాలకు తరలించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ సర్కారుపై చర్యలు తీసుకోవాలని, బాలల హక్కులను పరిరక్షించాలని న్యాయస్థానాన్ని ఏపీఎల్యూ అభ్యర్థించింది. చిన్నారులను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ కాలిఫోర్నియా జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మెక్సికో వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కడ సరిహద్దుల్లోనే వలసదారులను అదుపులోకి తీసుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.













