కన్నుల పండువగా ఆరిజోనాలో AAA సంక్రాతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) అరిజోనా చాప్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దాదాపు 10,000 మంది వేడుకలకు వచ్చి విజయవంతం చేశారు. ఫీనిక్స్ చుట్టుపక్కల ప్రాంతాల తెలుగువారు సైతం హాజరయ్యి కార్యక్రమాలను తిలకించారు. డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్‌ని వేదికగా ఎంచుకోవడం, అంత పెద్ద వెన్యూలో నిర్వహించే మొట్టమొదటి ఇండియన్ ఈవెంట్ కావడంతో ఈ వేడుక అందరినీ ఆకర్షించింది. అరిజోనా చాప్టర్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గొట్టిపాటి, వైస్ ప్రెసిడెంట్ నాగ జాలప్పగారి సారధ్యంలోని ఎఎఎ అరిజోనా చాప్టర్ కార్యవర్గ సభ్యులు నిర్వహించారు. 520 మందికి పైగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, నృత్యాలు, సింగింగ్ ఒక ఎత్తైతే, తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ (Mani Sharma)ట్రూప్ నిర్వహించిన సంగీత విభావరి మరొక ఎత్తు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఆధ్వర్యంలోని పలువురు గాయనీగాయకులు 90వ సంవత్సరంలోని మెలోడీస్, రీసెంట్ ఇయర్స్ నుండి క్లాస్ మాస్ మసాలా పాటలతో దే సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్ అనేలా లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఫౌండర్ హరి మోటుపల్లి, అధ్యక్షులు బాలాజీ వీర్నాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరిబాబు తూబాటి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎఎఎ ముఖ్య ఉద్దేశాలను, గ్రోత్‌ని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆది గుప్త, శ్రీకాంత్ ఎల్లమెల్లి, సూర్య మారెళ్ల, శ్రీని అడ్డా, రాజు, అశ్వని ధనియాల, రవితేజ మారినేని, మోహన్ ఆచంట, వెంకట్ బొల్లి తదితరులు పాల్గొన్నారు.
300 మంది వాలంటీర్స్ సహాయంతో 3 నెలలుగా ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియాలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ లో నిర్వహించనున్న జాతీయ కన్వెన్షన్‌కి ఒక బెంచ్ మార్క్ లా ఈ వేడుక నిలిచింది.







