ఒకే రకమైన ఆహారంతో అనారోగ్యమే
ప్రాసెస్డ్ మాంసం, ఫ్రైడ్ ఆహారం ఇలా తరచుగా ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా? వెంటనే అలవాటును మార్చుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇన్ప్లూయోంజా, ఇతర ప్లూ వైరస్లను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తమ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఎలుకలకు టైర్ట్- బటైల్హైడ్రోక్వినోన్ (టీబీహెచ్క్యూ) కలిగిన ప్రాసెస్డ్ ఆహారాన్ని అందించారు. కొద్దిరోజుల తర్వాత వాటిని పరిశీలించగా ప్లూ వైరస్లను ఎదుర్కొనే టీ-కణాల పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.













