అమరావతి జేఏసీకి అట్లాంటా ఎన్నారై విరాళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ జేఏసీకి అట్లాంటా ఎన్నారౖుె రూ.2 లక్షలు విరాళం అందించారు. అట్లాంటాకు చెందిన యార్లగడ్డ ఆనందకిషోర్, మధుకర్ హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు. కాగా విజయవాడలో జరిగిన యార్లగడ్డ మధుకర్ కుమారుడి నూతన వస్త్ర బహుకరణ వేడుకల్లో అతిథుందరికీ ఆయన అమరావతి హరిత కండువాను కప్పి స్వాగతించారు. ఆకు పచ్చ దుస్తులు, ఆకు పచ్చ కుండువాలు ధరించి, జై అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఏపీ ప్లకార్డుతో నినాదాలు చేశారు. తనకు రాజధానిలో సెంటు భూమి లేదని.. అయినా ప్రాంతంపై మమకారంతోనే సంఫీుభావం తెలుపుతున్నట్లు మధుకర్ తెలిపారు. తాము పెయిడ్ ఆర్టిస్టులం కాదన్నారు.













