అమెరికాలో 11వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 8వ బాలు సంగీతోత్సవాలు
అందరూ ఆహ్వానితులే
మిత్రులారా,
ఈ నెల ..అనగా మే, 12, 2018 నాడు డల్లాస్ లోనూ, ఆ మర్నాడు మే నెల 13వ తారీకున హ్యూస్టన్ లోనూ మొదలు పెట్టి 11వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 8వ బాలు సంగీతోత్సవాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 24 నగరాలలో జులై 8, 2018 వరకూ అత్యున్నత స్థాయి సినీ సంగీత కచేరీలు జరుగుతున్నాయి. ప్రవేశ రుసుము లేని ఈ కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే. ఇందుతో పాటు ఆ రెండు నగరాల ఆహ్వానాలు జతపరుస్తున్నాను.
హైదరాబాద్ నుంచి ప్రధాన గాయనీ గాయకులుగా “శివశంకరి” గీతాంజలి (రెండవ సారి అమెరికా పర్యటన), “అపర ఘంటసాల” తాతా బాల కామేశ్వర రావు (9 వ సారి అమెరికా పర్యటన) అన్ని నగరాలలోనూ తమ గానకౌశలంతో అలరిస్తారు. వీరిరువురూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది గాన కచేరీలు చేసిన లబ్ధ ప్రతిష్టులు.
ఇప్పటిదాకా అనేక నగరాలలో (Temple, TX, Dallas, Houston, New Jersey, Peoria, Chicago, Indianapolis, Greenville, Charloette, Los Angeles, Washington DC, etc). ఈ ఏటి ఘంటసాల ఆరాధనోత్సవాలు ఖరారు అయ్యాయి. మరికొన్ని నగరాలలో తేదీల నిర్ణయం జరుగుతోంది.
చిన్న నగరాలకి ప్రత్యేక అవకాశం:
తమ అసమాన గాన కౌశలంతో అలనాటి, ఈ నాటి సినీ సంగీతాన్ని ఇద్దరు అద్వితీయ గాయనీ గాయకులు మీ నగరంలో కూడా మిమ్మల్ని అలరించాలి అనే సదుద్దేశ్యం ఉన్న వారు వెనువెంటనే ఈ క్రింది వారిని సంప్రదించి మీకు అనువైన తేదీలలో ఈ గానవిభావరిని ఏర్పాటు చేసుకోండి. ఖర్చులన్నీ మావే. మీకు ఏ విధమైన ఆర్ధిక పరమైన ఒత్తిడీ ఉండదు. అమెరికాలో ఉన్న చిన్న నగరాలకి ఇది అరుదైన అవకాశం.
Available Dates for the Program in YOUR CITY as of today:
May 18, 20, 25, 26, 27
June 1, 8, 22, 24, 29
కార్యక్రమం కోసం సంప్రదించవలసిన వారు:
వంశీ రామరాజు (Whatsapp ఇండియా ఫోన్ నెంబర్: 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in)
వంగూరి చిట్టెన్ రాజు: (ఫోన్: 832 594 9054, e-మెయిల్: vangurifoundation@gmail.com)
జాతీయ సమన్వయ కర్త వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహణలో దేశవ్యాప్తంగా 24 నగరాలలో జరుగుతున్న ఈ సంగీత విభావరి కార్యక్రమాలు వేగేశ్న ఫౌండేషన్ (హైదరాబాద్) దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాల సేకరణ నిమిత్తం జరుగుతున్నాయి. 1988 లో కొందరు అమెరికా తెలుగు వారు నెలకొల్పిన వేగేశ్న సంస్థ ఇప్పుడు 30వ సంవత్సరంలో అడుగు పెట్టి సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కలిస్తోంది. “సేవా బ్రహ్మ” వంశీ రామరాజు ఈ సంస్థ ధర్మ కర్తగా, మేనేజింగ్ ట్రస్టీ గా ఈ 11వ ఘంటసాల ఆరాధనోత్సవాల లో స్వయంగా పాల్గొంటారు.
మరొక్క సారి ఈ ఉచిత ఉన్నత స్థాయి గాన విభావరి కార్యక్రమాలకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ..
వంగూరి చిట్టెన్ రాజు
ఫోన్: 832 594 9054













