వంద లో వరల్డ్ రికార్డు
వందేళ్ల వయస్సంటే నడవడమే కష్టం. కానీ వారు పరుగులే తీస్తున్నారు. ఏకంగా వరల్డ్ రికార్డులు నెలకొల్పారు. మేరీల్యాండ్‌లోని ల్యాండోవర్లో జరిగిన అమెరికా ట్రాక్, ఫీల్డ్ మాస్టర్స్ ఇండోర్ చాంపియన్షిప్ప్ ఈ అరుదైన ఘటనలకు వేదికైంది. 102 ఏళ్ల జూలియా మహిళల 100 ప్లస్ వయస్సు కేటగిరి 60 మీ. పరుగును 24.79 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. వందేళ్ల వయస్సులో అమె పోటీల్లో పాల్గొనడం ప్రారంభించడం మరో విశేషం. ఇక పురుషుల 60 మీ.లలో 100 ఏళ్ల ఆర్విల్లె రోజర్స్ 19.13 సెకన్లలో గమ్యం చేరి వరల్డ్ రికార్డు లిఖించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబర్ పైలెట్‌గా విధులు నిర్వర్తించిన రోజర్స్ 50 ఏళ్ల వయస్సులో రన్నింగ్ ప్రారంభించాడు. గుండెపోటుతో ఎడమ చేయి, పాదం, తుంటి తాత్కాలికంగా చచ్చుబడినా పరుగు పందేల్లో పోటీపడడం అతడు ఆపకపోవడం గమనార్హం.













