రివ్యూ : ప్రయోజాత్మక చిత్రం ‘జోహార్’

తెలుగుటైమ్స్ నెట్ రేటింగ్: 2.5/5
బ్యానర్: ధర్మసూర్య పిక్చర్స్ ఓ టి టి వేదిక: ఆహా
నటి నటులు : నైనా గంగూలి, అంకిత్ కొయ్య, ఎస్తేర్ అనిల్, శుభలేఖ సుధాకర్, కృష్ణ చైతన్య ఈశ్వరి రావు తదితరులు
మ్యూజిక్ : ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ ఎడిటింగ్ : సిద్ధార్థ్ తాతోలు, అన్వర్ అలీ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి రచన: నిఖిల్ మెహోత్రా, శరణ్ శర్మ మాటలు : రామ్ వంశీకృష్ణ నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీరావు మార్ని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజా మార్ని
విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2020
కరోనా వైరస్ త్రీవ్రత పెరుగక ముందే ఈ సినిమా పోస్టర్స్ తోనే మంచి పాజిటివ్ బజ్ ను సంతరించుకున్న చిత్రం “జోహార్”. అలాగే ఇటీవలే విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్లతో కూడా ఆకట్టుకుని ఇపుడు నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” లో అందుబాటిలోకి వచ్చింది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా ప్రతిమ) పేరిట నిలబెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం స్ఫూర్తితో ‘జోహార్’ చిత్రం రూపొందింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన తండ్రిని జనం కలకాలం దేవుడిగా కొలిచేందుకు భారీ విగ్రహం నెలకొల్పాలని సిద్ధ పడితే, అందువల్ల పలు వర్గాలకు చెందిన పేద జనం ఎలా ఇబ్బందులు పడి, జీవితాలు కోల్పోయారనేది ప్రధాన ఇతివృత్తం. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షా ఎలా ఉందొ తెలుసుకుందాం.
కథ:
ఈ చిత్రంలో మొత్తం ఐదు భిన్నమైన కథలతో కొనసాగుతుంది. వేదం, చందమామ కథలు తరహాలో కథాసంకలనం పద్ధతిలో వేరు వేరు పాత్రలు ఒకే సంఘటన కారణంగా ఎలా ప్రభావితమయ్యాయనేది ‘జోహార్’లో చూపించాడు యువ దర్శకుడు. పాత్రల పరంగా పరిచయం అయినపుడు ఆసక్తికరంగా అనిపించాయి ఓ యువ ముఖ్యమంత్రి(కృష్ణ చైతన్య) తన తండ్రి జ్ఞ్యాపకార్ధం ఒక భారీ విగ్రహాన్ని తన అధికారం ద్వారా నిర్మించాలని పరితపిస్తాడు. అలాగే మరో పక్క ఓ పేద రైతు(ఈశ్వరి రావ్), అథ్లెట్(నైనా గంగూలీ), వేశ్యావాటికలో జీవిస్తున్న టీనేజ్ యువతి (ఈస్తర్) ఒక టీ కొట్టులో పనిచేసే కుర్రాడు (అంకిత్) అలాగే ఓ అనాథశ్రయాన్ని నడిపే ముసలాయన(శుభలేఖ సుధాకర్) ల ఏ మాత్రం సంబంధం లేని జీవితాలకు ముఖ్యమంత్రి ఆచరిస్తున్న తలంపు వల్ల వీరికేమయ్యింది? అలా ఏర్పడిన రాజకీయ పరిణామాలు ఎటు దారి తీశాయి అన్నది అసలు కథ.
నటి నటుల హావభావాలు :
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ చైతన్య ఈ చిత్రంలో ఓ రాజకీయ నాయకునిగా ఎలా కనిపించాలో అలా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే అతని నటన మరో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మరియు ఈశ్వరి రావ్ తమ ఎమోషనల్స్ పెర్ఫామెన్స్ ద్వారా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. అలాగే యువ నటి ఈస్తర్ కూడా తన రోల్ ను చాలా క్లీన్ గా చేసింది. ఇక నైనా గంగూలీ విషయానికి వస్తే ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన ఈమె ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్తగా ఆమెను ఆవిష్కరించుకుంది అని చెప్పాలి. అలా తన పెర్ఫామెన్స్ తో నైనా మరో హైలైట్ అయ్యిందని చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
విజువల్‍గా ఈ చిత్రాన్ని ఇంప్రెసివ్‍గా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే దర్శకుడు ప్రతీ ఒక్కరి కథలను బాగా చూపించి నడిపించారు కానీ కథానుసారం వచ్చే ట్విస్టుల విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సింది. ఇవన్నీ కాస్త నిరాశ కలిగించే అంశాలు అని చెప్పొచ్చు. సినిమాలో చూపించిన ప్రతీ లొకేషన్స్ లో కెమెరా పనితనం చాలా బాగుంది. లో బడ్జెట్ సినిమా అయినా కానీ క్వాలిటీ పరంగా రాజీ పడిన ఫీల్ ఎక్కడా రాలేదు. ఛాయాగ్రహణం బాగుంది. అన్ని కథల మధ్య గందరగోళం లేకుండా ఎడిటింగ్ చక్కగా కుదిరింది. కానీ పాటలే సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు లేవు. ఒక్కోసారి మూడ్ స్పాయిలర్స్ లా కూడా మారాయి. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని సంభాషణలు బాగున్నాయి. అలాగే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
ఈ చిత్రం తీసుకు రావడానికి గుండె ధైర్యం కావాలి, దర్శకుడి ఉద్దేశం గొప్పదే కానీ అది విగ్రహం చుట్టూ కాకుండా మరో లాజికల్ ఇష్యూ కారణంగా ప్రభుత్వాలు తలపెట్టే కొన్ని పథకాలు, రాజకీయ నాయకులూ ఓటు బ్యాంకు రాజకీయాలు పేద ప్రజలను ఎలా అణగదొక్కుతాయన్నది చూపిస్తే బాగుండేది. అలా మాన్యుమెంట్‍లా మిగిలిపోయే విగ్రహాలు లేదా స్థూపాల వల్ల టూరిజం సంబంధిత ఆదాయం పెరుగుతుందే తప్ప ప్రగతికి వచ్చే అటంకం ఏముండదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే జోహార్ చిత్రం ఆకట్టుకునే ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. తమ పర్సనల్ ఎజెండా కొరకు ప్రజల సమస్యలను గాలికొదిలేసి కొందరు రాజకీయ పార్టీలపై డైరెక్ట్ గా సెటైర్ తో చూపించారు. అలాగే దర్శకుడు ఎన్నుకున్న కాన్సెప్ట్ కానీ చూపించిన కథలు కానీ ఆకట్టుకుంటాయి. కానీ కాస్త నెమ్మదిగా సాగే సెకండాఫ్ కొంచెం ముందు గానే ఊహించగలిగే కొన్ని సన్నివేశాలు అలాగే ఇచ్చే ఓ సామాజిక సందేశం ద్వారా డీసెంట్ గా నడిచే ఈ చిత్రం.