Toxic: కెజిఎఫ్3 వల్ల టాక్సిక్ కు లేనిపోని ఇబ్బందులు
కెజిఎఫ్(KGF) సినిమా చేసిన రచ్చ, హంగామా అంతా ఇంతా కాదు. అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీలో రూ.50 కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్ అని చెప్పుకునే వాళ్లు కాస్తా ఈ సినిమా తర్వాత మంచి కలెక్షన్లు అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్నారు. కెజిఎఫ్ హిట్ అయితే, కెజిఎఫ్2(KGF2) ఏకంగా రూ.1000 కోట్లు అందుకుని అందరి చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు మళ్లేలా చేసింది.
కెజిఎఫ్2 కు సీక్వెల్ గా కెజిఎఫ్3 ఉంటుందని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే యష్(Yash) కెజిఎఫ్2 తర్వాత గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో టాక్సిక్(Toxic) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార(Nayanathara) కీలక పాత్రలో నటిస్తోంది. ఇంత భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ టాక్సిక్ కు పెద్దగా బజ్ లేదు.
దానికి కారణం కెజిఎఫ్3(KGF3). యష్ ఫ్యాన్స్ అందరూ కెజిఎఫ్3 కోసం వెయిట్ చేస్తున్నారు. కెజిఎఫ్3 కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఆయన ఇంకో ప్రాజెక్ట్ చేయడం ఎవరికీ నచ్చడం లేదు. కెజిఎఫ్3 సెట్స్ పైకి వెళ్లాలంటే చాలానే టైమ్ పట్టనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్(NTR) తో డ్రాగన్(Dragon) చేస్తున్న నీల్(Neel), ఆ సినిమా తర్వాత సలార్2(Salaar2) చేయనున్నాడు. ఆ తర్వాత వీలును బట్టి కెజిఎఫ్3 ను పట్టాలెక్కించే ఛాన్సుంది. దీనంతటికీ చాలానే టైమ్ పడుతుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం యష్ క్రేజ్ ను, అతని స్టార్డమ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలంటే అది కెజిఎఫ్3 వల్ల మాత్రమే అవుతుందని, టాక్సిక్ సినిమా వల్ల కాదని భావిస్తున్నారు. మొత్తానికి టాక్సిక్ కు కెజిఎఫ్3 రూపంలో మరో కొత్త తలనొప్పి మొదలైందన్నమాట.













