Toxic: డైరెక్టర్ పనితనంతో హీరో అసంతృప్తి

కెజిఎఫ్(KGF) సినిమా చేయకముందు వరకు యష్(Yash) అంటే కేవలం కన్నడ చిత్ర పరిశ్రమ వరకు మాత్రమే తెలుసు. కానీ అతను ఏ ముహూర్తాన కెజిఎఫ్ చేశారో కానీ ఆ సినిమా తర్వాత తన స్థాయి, మార్కెట్ విపరీతంగా పెరిగాయి. కెజిఎఫ్ తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్2(KGF2) ఇంకా పెద్ద హిట్ అవడంతో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలోనే యష్ తర్వాతి సినిమా ఎవరితో చేస్తారు? ఎలాంటి జానర్ లో చేస్తాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యష్, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(geethu mohandas) దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశాడు. టాక్సిక్ అనే టైటిల్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టాక్సిక్(toxic) నుంచి టీజర్ మాత్రమే రిలీజైంది. ఆ టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఆడియన్స్ నుంచి టీజర్ కు మంచి రెస్పాన్స్ రాకపోవడం మరియు డైరెక్టర్ వర్క్ తో అసంతృప్తిగా ఉన్న యష్, స్వయంగా టాక్సిక్ కు తానే దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా టాక్సిక్ మేకర్స్ ఏదొక రూపంలో మూవీ నుంచి అదిరిపోయే కంటెంట్ ఇస్తే తప్పించి ఈ సినిమాపై బజ్ పెరిగే అవకాశాలు లేవు.