‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ విడుదల
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇసబెల్లే నాయికలు. కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శుక్రవారం టీజర్‌ని విడుదల చేశారు. ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు గౌతమ్. ప్రేమంటే ఒక శాక్రిఫైస్. ప్రేమలో దైవత్యం ఉంటుంది. అవేవీ నీకు అర్థం కావు.. అంటూ కథానాయిక మాటలతో ప్రారంభమయ్యే ఈటీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ మార్క్ సన్నివేశాలు ఇందులో కనిపించాయి. పలు కోణాల్లో సాగే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారు. సంగీతం: గోపీసుందర్.













