The Paradise: ప్యారడైజ్ మేకర్స్ రిస్క్ ఫలిస్తుందా?
నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కలయికలో దసరా(Dasara) అనే సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ అవడంతో ది ప్యారడైజ్ పై అందరికీ మొదట్నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో నాని చాలా డిఫరెంట్ గెటప్ లో రెండు జడలు, ముక్కు పోగుతో కనిపించి అందరికీ షాకివ్వగా, 1980 సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఓ రెడ్ లైట్ ఏరియాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం తీసుకుంటున్న ఆర్టిస్టుల ఎంపిక చూస్తుంటే ఈ చిత్ర మేకర్స్ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అర్థం కావడం లేదు.
ప్యారడైజ్ లో విలన్ గా మోహన్ బాబు(Mohan Babu)ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీకాంత్, హీరోయిన్ కోసం ఎంతో మంది స్టార్ హీరోయిన్లను పరిశీలించి ఆఖరికి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the dragon) మూవీ ఫేమ్ కయాదు లోహార్(Kayadhu Lohar) ను సెలెక్ట్ చేశారు. అంతేకాదు, ఓ సీరియస్ రోల్ కోసం పేరడీ మూవీస్ తో పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్(Sampoornesh Babu) ను తీసుకున్నారు. మరి ఇంత రిస్క్ చేస్తున్న మేకర్స్ ది ప్యారడైజ్ తో ఆఖరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.






